మహిళల ఆత్మరక్షణకు కవచంగా దిశా యాప్ పని చేస్తుందని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. యాప్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన దిశా యాప్ అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళా రక్షణ గురించి ముఖ్యమంత్రి జగనన్నకు బాగా తెలుసని.. అద్భుతమైన ఆలోచన, ఆశయంతో దిశ చట్టానికి రూపకల్పన చేశారన్నారు. కేంద్రం అమలు చేసిన నిర్భయ, పోక్సో చట్టాల కన్నా బలమైన చట్టంగా దిశ పేరు పొందిందన్నారు. గ్రామ మహిళా పోలీసులు, సంఘ మిత్రలు, మహిళా సంఘ లీడర్లు యాప్ వినియోగంపై ప్రజలను చైతన్యపరచాలని కోరారు.
DISHA APP: మహిళలకు రక్షణ కవచం దిశా యాప్: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి - దిశా యాప్ తాజావార్తలు
'దిశా యాప్' మహిళలకు రక్షణా కవచంగా పని చేస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన దిశా యాప్ అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దిశా యాప్
మహిళలందరికీ రక్షణ కల్పించేది దిశ చట్టం ఒక్కటేనని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అన్నారు. దిశా యాప్ను ప్రతి మహిళ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. అత్యవసరమైన పరిస్థితుల్లో ఇది మహిళకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, తిరుపతి అర్బన్ ఎస్పీతో పాటు శ్రీ పద్మావతీ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జమున పాల్గొన్నారు.
ఇదీ చదవండి: