తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తికి ఓటు వేయాలని కోరుతూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రచారం నిర్వహించారు. నగరంలోని పీకే లేఅవుట్ ప్రాంతంలో పర్యటిస్తూ.. ఇంటింటి ప్రచారం చేపట్టారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటెయాలని కోరారు. మిగిలిన పార్టీలకంటే అత్యధిక మెజార్టీతో వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం సాధిస్తారని భూమన ధీమా వ్యక్తం చేశారు.
తిరుపతి ఉపఎన్నికలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రచారం - తిరుపతి ఉపఎన్నికలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రచారం
తిరుపతి ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి తరుపున ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రచారం చేశారు. వైకాపాకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్ధించారు.
ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి