కరోనా కష్టకాలంలోనూ ప్రజలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరుతూ... తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గౌరవ ఛైర్మన్ హోదాలో పాల్గొన్న ఆయన....ఓ కుష్ఠు రోగి బండిని లాగుతూ అతని కోసం విరాళాలు సేకరించారు. నగరంలోని నాలుగుకాళ్ల మండపం నుంచి కృష్ణాపురం ఠాణా వరకూ బండిని లాగుతూ ఎమ్మెల్యే ప్రజల నుంచి చందాలు కోరారు.
కాలే కడుపులపై...'కరుణ' చూపాలని..! - తిరుపతి వార్తలు
తిరుపతి నగరంలో మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో.. ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. చెక్కబండిపై కుష్ఠు రోగిని కూర్చోబెట్టి.. తాడు సాయంతో బండిని లాగుతూ విరాళాలు సేకరించారు.
కుష్ఠు రోగిని లాగుతున్న ఎమ్మెల్యే భూమన
కరోనా భయంతో ప్రజలు తమ గురించి తప్ప మిగతా వారిని పట్టించుకోకపోవటం, కరోనా రోగుల పట్ల వివక్షతో వ్యవహరించటం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. సాటి మనుషుల పట్ల కరుణతో మెలగాలంటూ సందేశాన్నిచ్చారు.
ఇవీ చదవండి:కృష్ణా నది వరద ఉద్ధృతి.. సామాన్యులకు తప్పని తిప్పలు