ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు' - భూమన కరుణాకర్ రెడ్డి తాజా వార్తలు

మతాన్ని రాజకీయ అంశాలతో ముడిపెట్టి కొంతమంది లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి విమర్శించారు. వారికి జ్ఞానోదయం కలిగించేలా.. సమధర్మం ప్రాధాన్యతను వివరించేలా.. విజయ శంకర స్వామి మహాభారతం రచించారన్నారు.

'మతాన్ని రాజకీయ అంశాలతో ముడిపెట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు'
'మతాన్ని రాజకీయ అంశాలతో ముడిపెట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు'

By

Published : Jan 17, 2021, 10:27 PM IST

భారతీయ సనాతన ధర్మం, మతమంటే అర్థం తెలియని వాళ్లు అధికారం పొందటం కోసం మతాలను అడ్డు పెట్టుకుంటున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. సనాతన సమధర్మ ప్రచార పరిషత్ వ్యవస్థాపకులు విజయ శంకర స్వామి రచించిన మహాభారతం గ్రంథాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసులుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. మతాన్ని రాజకీయ అంశాలతో ముడిపెట్టి కొంతమంది లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారన్నారని కరుణాకర్ రెడ్డి విమర్శించారు. వారికి జ్ఞానోదయం కలిగించేలా.. సమధర్మం ప్రాధాన్యతను వివరించేలా.. విజయ శంకర స్వామి మహాభారతం రచించారన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details