Ministers Comments On Amaravati: తెదేపా ముసుగులో అమరావతి రైతుల ఉద్యమం నడుస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. భాజపాతో ఎలాగైనా జట్టు కట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని అన్నారు. ఎన్ని పార్టీలు జట్టు కట్టినా.. వైకాపా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
3 రాజధానులు వచ్చి తీరుతాయి - మంత్రి సీదిరి
Seediri AppalaRaju comments on 3 Capitals: రాష్ట్రానికి 3 రాజధానులు వచ్చి తీరతాయని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఉత్తరాంధ్ర ఐకాస ఏర్పాటు చేశామన్న ఆయన.. విశాఖలో పాలనా రాజధానికి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశామని వెల్లడించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు విడిచిపెట్టి సీపీఐ ప్రవర్తిస్తోందని విమర్శించారు.
తిరుపతిలో మార్మోగిన అమరావతి నినాదం..
అమరావతి అందరిదీ అంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా కదం తొక్కిన రైతులు.. పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని.. తిరుపతిలో రాజధాని పరిరక్షణ మహోద్యమ సభ నిర్వహించారు. వివిధప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులు, ప్రజలతో సభా ప్రాంగణం జనసంద్రమైంది. అమరావతి రైతులకు మద్దతుగా ప్రజలు ఆకు పచ్చకండువాలు.. మెడలో వేసుకుని సభకు వచ్చారు. కళాకారులు ఉద్యమగీతాలు ఆలపించగా.. రైతులు, మహిళలు ఆకుపచ్చ కుండువాలు గాల్లో తిప్పుతూ గొంతుకలిపారు.
ఈ సభలో మాట్లాడిన చంద్రబాబు... రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాజధాని రైతులు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించారు. "జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పారు? అసెంబ్లీలో ఏం చెప్పారు? ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడం నాకిష్టం లేదు.. రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పారు. ఎన్నికల ముందు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోవాలి. మడమతిప్పనన్న జగన్.. అమరావతిపై ఎందుకు మాట తప్పారు? అమరావతిపై కుల ముద్రవేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారందరిదీ ఏ కులం? జగన్ ఇష్టానుసారం చేస్తే కుదరదు.