తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యే సిద్దారెడ్డి, భాజాపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్, తమిళనాడు భాజాపా అధ్యక్షుడు మురుగన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అంజేశారు. ప్రజలందరూ కరోనా నియమాలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సునీల్ దేవధర్ కోరారు. ఉపఎన్నికలో తిరుపతి పవిత్రతను కాపాడే వారిని ప్రజలు ఎన్నుకోవాలన్నారు
తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖులు - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భాజాపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖులు