తిరుమల శ్రీవారిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి - తిరుమల వార్తలు
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వినాయక చవితి పండుగపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
![తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి minister-vellampalli-srinivasa-rao-visited-thirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8502034-131-8502034-1597996217934.jpg)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి
వినాయక చవితి పండుగపై ప్రతిపక్షాలు, రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కొవిడ్ ప్రోటోకాల్ ప్రకారం, పూజలు చేసుకుని ప్రజలు సురక్షితంగా ఉండాలన్నారు.
ఇవీ చదవండి:స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి 'స్వచ్ఛ కిరీటాలు'