దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలని భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ డిమాండ్ చేశారు. పవిత్రమైన దేవదాయ శాఖలో ఉండి దర్గాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి వైఖరిపట్ల... తిరుపతిలో భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో పెద్దఎత్తున తోపులాట జరిగింది. సీఎం జగన్ స్పందించి మంత్రిని తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలి: భాజపా నేత సురేంద్ర మోహన్ - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలని.. భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ డిమాండ్ చేశారు. దర్గాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి వైఖరిపట్ల.. తిరుపతిలో భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలి: భాజపా నేత సురేంద్ర మోహన్