బాదుడే బాదుడు అంటూ తెలుగుదేశం అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి రోజా విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నిరకాల ఛార్జీలు పెంచేసి, ఇప్పుడు చంద్రబాబు నిరసనలకు సిద్ధం కావడం సరికాదన్నారు. ఇలాగే చేస్తుంటే వచ్చే ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి పరాజయం తప్పదన్నారు. గతంలో నరకాసుర ఆంధ్రప్రదేశ్గా మారింది కాబట్టే ప్రజలు చంద్రబాబును దించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారన్నారు. ఈనెల 5న విద్యాదీవెన కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి జగన్ తిరుపతికి వస్తున్న సందర్భంగా.. తారకరామ స్టేడియంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డితో కలిసి ఆమె ఏర్పాట్లను పరిశీలించారు.
తెదేపాది అనవసర రాద్ధాంతం.. అందుకే జగన్కు పట్టం: మంత్రి రోజా
గతంలో నరకాసుర ఆంధ్రప్రదేశ్గా మారింది కాబట్టే ప్రజలు చంద్రబాబును దించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారని మంత్రి రోజా అన్నారు. బాదుడే బాదుడు అంటూ తెలుగుదేశం అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.
తెదేపాది అనవసర రాద్ధాంతం