చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆరోగ్య పరీక్షలు చేసి... అనుమానిత లక్షణాలు ఉంటే తిరుపతి కొవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రిలో వైద్యం అందించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి పెద్దిరెడ్డి హాజరయ్యారు. కలెక్టర్ భరత్ గుప్తా, ఎస్పీలు, ఇతర వైద్య ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై మరింత దృష్టి సారించాల్సిందిగా సూచించారు.
'నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారికి 28 రోజుల క్వారంటైన్'
తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులతో సమావేశం అయ్యారు. కొవిడ్ -19 అనుమానితుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని 28 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతామని చెప్పారు.
minister peddireddy review on corona precautions