ఆధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా ఏపీ పోలీస్ అడుగులు వేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. డ్యూటీ మీట్ కార్యక్రమం ప్రతి ఏడాది జరగాలని అభిప్రాయపడ్డారు.
దిశ చట్టం చేసి పంపాలని ఆలోచన చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్దేనని మంత్రి చెప్పారు. పోలీసులకు వారాంతపు సెలవు ఇస్తున్న ఘనత కూడా రాష్ట్రానికి ఉందన్నారు. ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజల వద్దకే పోలీస్ సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామానికి మహిళా పోలీసులు వెళ్తున్నారని.... శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.