కరోనా ఆంక్షలు, ఎన్నికల కోడ్ వల్లే తెదేపా అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కొవిడ్, ఎన్నికల నిబంధనలతో పర్యటన కుదరదంటూ పోలీసులు ఆయనకు ముందే చెప్పారన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలిసినా కేవలం శాంతిభద్రతల సమస్య సృష్టించి ప్రజలను ఆకట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పెద్దరెడ్డి ఆరోపించారు.
పర్యటన కుదరదని ముందే చెప్పారు: మంత్రి పెద్దిరెడ్డి - చంద్రబాబుపై పెద్దిరెడ్డి కామెంట్స్
చంద్రబాబు చేస్తామన్న దీక్ష నిబంధనలకు విరుద్ధమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కొవిడ్ ఆంక్షలు, ఎన్నికల కోడ్ వల్ల దీక్ష కుదరదని వ్యాఖ్యానించారు.
పోలీసులను ఇబ్బంది పెట్టొద్దని చంద్రబాబును కోరుతున్నాం: పెద్దిరెడ్డి