ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని మార్పు గురించి ఆలోచించే పరిస్థితి లేదు: పెద్దిరెడ్డి - చంద్రబాబుపై వైసీపీ కామెంట్స్

ప్రస్తుతం కరోనాతో రాజధాని మార్పు గురించి ఆలోచించే పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని.. తిరుపతిలోని ఆయన నివాసంలో చెప్పారు.

minister peddireddy on mining allegations in east goavari
minister peddireddy on mining allegations in east goavari

By

Published : Jun 21, 2020, 7:21 PM IST

Updated : Jun 21, 2020, 8:51 PM IST

రాజధాని మార్పు గురించి ఆలోచించే పరిస్థితి లేదు: పెద్దిరెడ్డి

కరోనా కారణంగా మూడు రాజధానుల అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నిర్ణయాలేమీ తీసుకోవటం లేదు. కరోనా తగ్గుముఖం పట్టాకే రాజధాని మార్పు గురించి మాట్లాడతాం. రాజధాని తరలింపు అంశం గవర్నర్ కూడా చెప్పారు. రాజధాని తరలింపుపై సరైన సమయంలో తదుపరి నిర్ణయం ఉంటుంది.

-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

గనుల్లో లభ్యమవుతున్నది బాక్సైట్ కాదని కేంద్రం తేల్చాకనే....లాటరైట్ గనులకు అనుమతులిచ్చామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నిరాధారణ ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.ఎంపీ రఘరామకృష్ణరాజు వెనక ఉన్నదెవరో ప్రజలందరికీ తెలుసని.. తెదేపా అధినేత చంద్రబాబే ఆయనతో రాజకీయం చేయిస్తున్నారన్నారంటూ ఆరోపించారు.

ఇదీ చదవండి: నాకు ప్రాణహాని ఉంది: లోక్​సభ స్పీకర్​కు రఘురామకృష్ణరాజు లేఖ

Last Updated : Jun 21, 2020, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details