ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయకుండా.. కలెక్టర్, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎంత రుసుం తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వం జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌పై అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయకుండా టాస్క్‌ఫోర్స్ కమిటీ: పెద్దిరెడ్డి - ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు న్యూస్
ప్రైవేట్ ఆస్పత్రుల్లో నోడల్ అధికారులను నియమించామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. అధిక ఫీజులు వసూలు చేయకుండా టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
minister peddireddy about task force committe on private hospital bills
'ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే ఆస్పత్రులను బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం. కేసులు ఎక్కువుంటే దుకాణాల మూసివేతకు వ్యాపారులు నిర్ణయం తీసుకోవాలి. తిరుపతి బర్డ్ ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మారుస్తున్నాం. ఆక్సిజన్ కోసం రుయా, స్విమ్స్‌లో 2 ట్యాంకులు అదనంగా ఉంచాం. ఆన్‌లైన్‌లో రోగి వివరాలు నమోదు చేయని ఆస్పత్రులను బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం' అని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి:'నాకు కరోనాతో భయం లేదు.. ఆ ఫ్యాన్ తోనే!'