ఈ ఏడాది అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో జరిగిన మన పాలన-మీ సూచన కార్యక్రమంలో మూడోరోజు ఆయన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రభావం చూపించిందన్న పెద్దిరెడ్డి... ఇక వాటిపైనా దృష్టి సారిస్తామన్నారు.13 జిల్లాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేలా 46 వేల కోట్ల రూపాయల నిధులతో సాగునీటి కార్యక్రమాన్ని వాటర్ గ్రిడ్ ద్వారా పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాయలసీమలో తాగునీటి దాహార్తి తీర్చేందుకు శ్రీశైలం నుంచి నీటి కోసం, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచేందుకు దాదాపు 36 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఏడాదిగా అభివృద్ధి పనులు చేయలేకపోయాం: మంత్రి పెద్దిరెడ్డి - అభివృద్ధి పనులపై మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్
ఆర్థిక పరిస్థితి బాగాలేక ఏడాదిగా అభివృద్ధి పనులు చేయలేకపోయామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గడిచిన ఏడాదిగా సంక్షేమ పథకాల అమలుకే నిధులు ఖర్చు చేశామని వివరించారు.
![ఏడాదిగా అభివృద్ధి పనులు చేయలేకపోయాం: మంత్రి పెద్దిరెడ్డి minister peddireddy about state financial status](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7371581-615-7371581-1590589404468.jpg)
minister peddireddy about state financial status