మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో చిత్తూరు జిల్లా మామిడి రైతుల కష్టాలపై ఆయన స్పందించారు. స్వతహాగా తానూ రైతు కావటంతో..అన్నదాతల ఇబ్బందులు తెలుసునన్నారు.
తోతాపరి మామిడి కిలోకు పన్నెండు నుంచి పదిహేను రూపాయలు అందేలా గుజ్జు పరిశ్రమలతో కలెక్టర్ సమావేశాలు జరిపి ఒప్పించారన్నారు. మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధితో రైతు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని పెద్దిరెడ్డి తెలిపారు.