ఓటర్లను చంద్రబాబు, లోకేశ్ తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఓడిపోతే తెదేపా ఎంపీలు రాజీనామా చేయాలని సవాల్ చేశామని.. సవాల్‌కు ఇంతవరకు స్పందన లేదని అన్నారు. హిందూ మతాన్ని రెచ్చగొట్టేలా భాజపా వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుపతిలో చంద్రబాబు రాళ్లదాడి డ్రామా ఆడారని దుయ్యబట్టారు. తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపా గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. పోలింగ్ శాతం పెరిగితే వైకాపాకు 5 నుంచి 6 లక్షల మెజారిటీ వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
'చంద్రబాబు రాళ్లదాడి డ్రామా ఆడారు' - తిరుపతి ఉప ఎన్నికలపై తాజా వార్తలు
తిరుపతి ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే వైకాపాకు 5 నుంచి 6 లక్షల మెజారిటీ వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఓటర్లను చంద్రబాబు, లోకేశ్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
minister peddi reddy