ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిమ్మగడ్డ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: పెద్దిరెడ్డి

ఎస్‌ఈసీ మాటవిని కలెక్టర్లు, ఎన్నికల అధికారులు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఏకగ్రీవాలైన చోట డిక్లరేషన్ పత్రాలు తప్పకుండా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Minister Peddi Reddy
మంత్రి పెద్దిరెడ్డి

By

Published : Feb 5, 2021, 7:17 PM IST

మంత్రి పెద్దిరెడ్డి

రిటర్నింగ్‌ అధికారి తీసుకున్న నిర్ణయాలను నిలిపివేసే అధికారం ఎస్​ఈసీకి లేదని....ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచులకు డిక్లరేషన్‌ పత్రాలు జారీ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేస్తే జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్‌ అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. చర్యలు తీసుకోవడంతో పాటు తమ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం వారందరినీ బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details