దశలవారీ మద్య నిషేధంపై ప్రభుత్వం తొలి అడుగు వేసిందని అబ్కారీ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన... నూతన ఎక్సైజ్ విధానం వివరాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3500 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఉన్న 43 వేల మద్యం గొలుసు దుకాణాలు రద్దు చేశామని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 వరకు విక్రయాలు ఉంటాయని నారాయణస్వామి అన్నారు. గ్రామ కమిటీల ద్వారా నాటుసారా విక్రయాలు పూర్తిగా నిర్మూలించామన్నారు. నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు చర్యలు చేపడతామన్నారు. అన్ని ఆస్పత్రుల్లోనూ డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బార్ల సంఖ్య తగ్గింపులో న్యాయపరమైన సమస్యలున్నాయని నారాయణస్వామి అన్నారు. ప్రతి విషయంపై సమగ్ర అవగాహనతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. లోపభూయిష్టంగా ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదని స్పష్టం చేశారు.
20 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం: నారాయణస్వామి - 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం
మద్య నిషేధం దశలవారీ అమలుకు తొలి అడుగు పడిందని అబ్కారీ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. గతంలో ఉన్న 43 వేల మద్యం గొలుసు దుకాణాలు రద్దు చేశామన్న ఆయన... 20 శాతం తగ్గించి 3500 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రంలో 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం : నారాయణస్వామి