ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా..: ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి - tirupati latest news
14:38 August 27
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మీడియా సమావేశం
తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సమితి అధ్యక్షుడి నుంచి నేటి వరకు నిజాయితీగా పనిచేశానని స్పష్టంచేశారు. ఈ మేరకు తిరుపతిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను కాణిపాకంలో సత్య ప్రమాణం చేయడానికి సిద్దమని.. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సిద్దమా అని సవాల్ విసిరారు. చంద్రబాబు తన అనుచరులతో తప్పుడు ఆరోపణలు చేయిస్తూ.. బురద చల్లేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. అలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు.
ఇదీ చదవండి...
TS LETTER TO CENTRAL: వెలిగొండకు కేంద్రం నిధులపై తెలంగాణ అభ్యంతరం
TAGGED:
Deputy cm Narayana Swamy