తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్, ఐపీఎస్ అధికారి ఎబీ.వెంకటేశ్వరరావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రముఖులు - తిరుమల తిరుపతి తాజా వార్తలు
వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.
శ్రీవారి సేవలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ