ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్ధితిపై మంత్రి ఆళ్ల నాని ఆరా - టీకాతో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి ఆళ్ల నాని వాకబు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏడుగురు నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. ఘటనపై ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తిరుపతి రుయాలో చికిత్స అందిస్తుండగా.. వారికి ప్రత్యేక వార్డు కేటాయించి మెరుగైన సేవలు అందించాలన్నారు.

minister alla nani enquired about vaccinated students health at tirupati
టీకాతో విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై మంత్రి ఆళ్ల నాని వాకబు

By

Published : Feb 5, 2021, 11:03 PM IST

తిరుపతిలో కరోనా టీకా వేయించుకున్న నర్సింగ్ విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురి కావడంపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పందించారు. బాధితులకు తక్షణం మెరుగైన చికిత్స అందించాల్సిందిగా స్థానిక వైద్యాధికారులకు సూచించారు. వారికి ప్రత్యేక వార్డు కేటాయించి వైద్య సహాయం చేయాలని ఆదేశించారు.

రెండవ విడత వాక్సినేషన్​లో భాగంగా 130 మంది నర్సింగ్ విద్యార్థులు టీకా తీసుకోగా.. వారిలో ఏడుగురు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సిబ్బంది తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం రేపు ఇంటికి పంపిస్తామని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details