తిరుమల తిరుపతి దేవస్థానం, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉడిపి పుత్తెగె మఠం సుగుణేంద్ర తీర్థస్వామిజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన భజన బృందాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. అలిపిరి పాదాల మండపం నుంచి మూడు వేల మంది భజన బృందాల సభ్యులు సంప్రదాయ భజనలు చేస్తూ మెట్ల మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు. తితిదే నిర్వహిస్తున్న మెట్లోత్సవ వేడుకలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తాయని సుగుణేంద్ర తీర్థస్వామిజీ పేర్కొన్నారు.
తిరుమలలో వైభవంగా మెట్లోత్సవ వేడుకలు - తిరుమలలో మెట్లోత్సవ వేడుకలు
అలిపిరి పాదాల వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలోే శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. దాదాపు మూడు వేల మంది భజన బృంద సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ మెట్ల మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు.
![తిరుమలలో వైభవంగా మెట్లోత్సవ వేడుకలు metlotsavam in tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5663708-426-5663708-1578667113233.jpg)
తిరుమలలో వైభవంగా మెట్లోత్సవ వేడుకలు