ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటలు! - తిరుమల తాజా వార్తలు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం కంపార్ట్‌మెంట్లు నిండిపోయి నందకం వరకు భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Tirumala
తిరుమలలో భక్తుల రద్దీ

By

Published : Jun 25, 2022, 7:48 AM IST

Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి వారాంతంలో భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. నందకం వరకు వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు 20 గంటల సమయం పట్టింది. రద్దీ అధికంగా ఉండడంతో క్యూలైన్లలో అవస్థ పడుతున్నారు. దీనికి తోడు ఎండవేడిమి కారణంగా భక్తులు ఇబ్బంది పడ్డారు. గురువారం శ్రీవారిని 68,873 మంది దర్శించుకున్నారు. రూ.4.44 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

ABOUT THE AUTHOR

...view details