ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాపై తితిదే చర్యలు ప్రశంసనీయం: నూతన జంట - covid-19

కరోనా ప్రభావంతో తితిదే తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయమని ఓ నూతన పెళ్లి జంట తెలిపింది. శుక్రవారం కొండపై దేవుని సన్నిధిలో వివాహం చేసుకున్న వధూవరులు ఆనందం వ్యక్తం చేశారు.

marriage in tirumala
తిరుమలలో వివాహం చేసుకున్న నూతన జంట

By

Published : Mar 21, 2020, 8:18 AM IST

తిరుమలలో వివాహం చేసుకున్న నూతన జంట

కరోనా ప్రభావంతో తితిదే తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కొండపై వివాహం చేసుకున్న ఓ నూతన జంట తెలిపింది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వారు తిరుమలలోని పురోహిత సంఘంలో శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. గుంటూరు నుంచి అలిపిరి వద్దకు చేరుకున్న వీరిని తితిదే సిబ్బంది నిలిపివేశారు. ఆందోళన చెందిన వీరు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. స్పందించిన అధికారులు వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులను కలిపి మొత్తం ఆరుగురిని కొండపైకి అనుమతించారు. పురోహిత సంఘానికి చేరుకున్న నూతన వధూవరులు వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణలో భాగంగా తితిదే తీసుకున్న నిర్ణయాలను అందరూ తప్పకుండా పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details