hanuman birth place : తిరుమలలోని అంజనాద్రిలో హనుమజన్మస్థల అభివృద్ధికి అంతా సహకరించాలని పలువురు పీఠాధిపతులు పిలుపునిచ్చారు. అంజనాద్రిపై అభివృద్ధి పనుల భూమిపూజా కార్యక్రమంలో పలువురు స్వామీజీలు పాల్గొన్నారు. "ఆంజనేయ స్వామివారి జన్మస్థలం అంజనాద్రి- తిరుమల" పేరిట రాసిన పుస్తకాన్ని రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద గిరి ఆవిష్కరించారు.
"అంజనాద్రి అభివృద్ధికి.. వారి అంగీకారం అవసరమా..?" - ఆంజనేయ స్వామి జన్మస్థలంపై పుస్తకం వార్తలు
Hanuman birth place : తిరుమలలోని అంజనాద్రిలో ఆంజనేయ స్వామివారి జన్మస్థలం అభివృద్ధికి అంతా సహకరించాలని పలువురు పీఠాధిపతులు పిలుపునిచ్చారు. "ఆంజనేయ స్వామివారి జన్మస్థలం అంజనాద్రి-తిరుమల" పేరిట రాసిన పుస్తకాన్ని రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద గిరి ఆవిష్కరించారు. అంజనాద్రి అభివృద్ధికి ఇతర రాష్ట్రాల వారి అంగీకారం అవసరమా? అని స్వరూపానందేంద్రస్వామి ప్రశ్నించారు.
స్వరూపానందేంద్రస్వామి
వేల ఏళ్ల క్రితం జన్మించిన హనుమ స్థలం నిర్దారించడం కష్టమన్న ఆయన.. ఆలయం ఎక్కడ నిర్మించినా అంగీకరించాలని కోరారు. అంజనాద్రి అభివృద్ధికి ఇతర రాష్ట్రాల వారి అంగీకారం అవసరమా? అని స్వరూపానందేంద్రస్వామి ప్రశ్నించారు.
ఇదీ చదవండి