నాడు - నేడులో భాగంగా స్కూళ్లల్లో చేపడుతున్న పనులను నాణ్యతతో పూర్తి చేయాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. స్కూళ్లలో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. తిరుపతిలో నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేశారు. మనబడి - నాడు నేడుపై ఎస్వీయూ సెనెట్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మనబడి - నాడు నేడుపై పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి సమీక్ష - Chief Secretary of School Education news
నాడు - నేడు పథకంలో భాగంగా చేపడుతున్న పనులను నాణ్యతతో పూర్తి చేయాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి రెండవ దశ పనులను ప్రారంభిస్తామని అన్నారు.
జిల్లాలో నాడు - నేడు కింద 1,533 పాఠశాలల్లో చేపట్టిన పనులు ముగింపు దశకు చేరుకున్నాయని బి.రాజశేఖర్ తెలిపారు. రెండవ దశలో చేపట్టే పనులను ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభిస్తామన్నారు. పనులను వేగవంతం చేసేందుకు సచివాలయాలలోని ఇంజనీర్లను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ జరిగేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు ర్యాంకింగ్ ఇచ్చే విధంగా అకడెమిక్ పర్ఫార్మన్స్ను పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:పుర పోరు: రెండు నగర, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు