తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఉదయం ఐదున్నర గంటల సమయంలో గుర్తు తెలియని భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీవారి ఆభిషేకానికి తిరుమల గోశాల నుంచి పాలు తీసుకువస్తున్న వాహనం ఆలయం ముందుకు రాగానే ఓ భక్తుడు పాల ట్యాంకర్ కింద పడ్డాడు. ట్యాంకర్ వెనుక టైర్లు తలపై నుంచి వెళ్లడం వల్ల సంఘటనా స్థలంలోనే భక్తులు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న తితిదే భద్రతా సిబ్బంది, తిరుమల పోలీసులు మాఢ వీధుల్లోకి చేరుకొని మృతదేహాన్ని అశ్విని ఆసుపత్రికి తరలించారు. పాల వాహనాన్ని తిరుమల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆలయం ముందు... తూర్పు మాఢ వీధిలో భక్తుడు చనిపోవడం వల్ల స్వామివారి కైంకర్యాలను నిలిపివేశారు. ఆగమశాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి నిత్యపూజలు చేపట్టారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
తిరుమల కొండపై లైవ్లో ఆత్మహత్య ..! - man suicide in tirumala news
తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు పాలు తీసుకొస్తున్న లారీ కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. భక్తుడి ఆత్మహత్యతో స్వామివారి కైంకర్యాలు నిలిపివేసి, ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
![తిరుమల కొండపై లైవ్లో ఆత్మహత్య ..! man suicide in tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5357750-931-5357750-1576212243191.jpg)
తిరుమలలో వ్యాను కిందపడి వ్యక్తి ఆత్మహత్య ..!
Last Updated : Dec 13, 2019, 3:55 PM IST