ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BLACK FUNGUS: బ్లాక్​ ఫంగస్​తో వ్యక్తి మృతి..స్విమ్స్​ ముందు ఆందోళన - black fungus cases in andhra pradesh

తిరుపతి స్విమ్స్​లో బ్లాక్​ ఫంగస్​ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త చనిపోయాడని మృతుని భర్య ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.

man died with black fungus in sivms
man died with black fungus in sivms

By

Published : Jun 16, 2021, 1:50 PM IST

బ్లాక్​ ఫంగస్​తో వ్యక్తి మృతి..స్విమ్స్​ ముందు మృతుని భార్య ఆందోళన

తిరుపతి స్విమ్స్​లో బ్లాక్​ ఫంగస్​ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త చనిపోయాడని మృతుని భర్య ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. బ్లాక్ ఫంగస్​తో బాధపడుతున్న తన భర్తను వైద్యులు పట్టించుకోలేదని ఆరోపించారు.

కడప జిల్లా చక్రాయపేటకు చెందిన ఆంజనేయులు నాయక్ (38)కు బ్లాక్ ఫంగస్ సోకటంతో.. గత నెల 28న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఫంగస్ మెదడుకు సోకటంతో.. బుధవారం తెల్లవారుజూమున ఆంజనేయులు తుదిశ్వాస విడిచారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుని భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇదీ చదవండి:

108 అంబులెన్స్​లో శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి

ABOUT THE AUTHOR

...view details