ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నిక: జోరుగా ప్రచారపర్వం.. వేడెక్కుతున్న రాజకీయం - తిరుపతి ఉప ఎన్నిక తాజా వార్తలు

తిరుపతి ఉపఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వైకాపా, తెలుగుదేశం ప్రచారంలో దూసుకుపోతుండగా.. జనసేన-భాజపా అగ్రనాయకులు సైతం ప్రచారపర్వాన్ని ప్రారంభించారు. ఆ పార్టీ అభ్యర్థి తొలిసారి తిరుపతిలో పర్యటించారు. నేడు వైకాపా అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

తిరుపతి ఉప ఎన్నిక
తిరుపతి ఉప ఎన్నిక 2021

By

Published : Mar 29, 2021, 4:04 AM IST

Updated : Mar 29, 2021, 4:10 AM IST

తిరుపతి ఉప ఎన్నిక: జోరుగా ప్రచారపర్వం.. వేడెక్కుతున్న రాజకీయం

తిరుపతి ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు లోక్‌సభ నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడం, సభలు, సమావేశాలు, ర్యాలీలతో ఎన్నికల వాతావరణం వేడెక్కిస్తున్నాయి. అధికార వైకాపా అభ్యర్ధిగా నేడు గురుమూర్తి నామినేషన్ల వేయనున్నారు. ఈ మేరకు తిరుపతిలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి సహా వైకాపా కీలక నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విజయాన్ని పునరావృతం చేస్తూ.. తిరుపతి ఉప ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించే అత్యధిక మెజార్టీతో గురుమూర్తిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

నెల్లూరు జిల్లా నాయుడుపేట, పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు పరిసర గ్రామాల్లో తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మీ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించి అధికార పార్టీకి బుద్ది చెప్పాలన్నారు.

భాజపా- జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ సైతం తిరుపతిలో ప్రచారం నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, ప్రచార కమిటీ ఛైర్మన్ ఆదినారాయణరెడ్డి ఆమెకు మద్దతుగా నిలిచారు. జనసేన- భాజపా మధ్య ఎలాంటి విభేదాలు లేవని...త్వరలోనే పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో ప్రచారం నిర్వహిస్తారని రత్నప్రభ తెలిపారు. తిరుపతిలో సమావేశమైన భాజపా- జనసేన నాయకులు ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మరోవైపు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ సైతం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి

హోలీ ప్రత్యేకం.. ఇక్కడ మగాళ్లు.. మగువల్లా సింగారించుకుంటారు

Last Updated : Mar 29, 2021, 4:10 AM IST

ABOUT THE AUTHOR

...view details