'మదనపల్లె ఘటన నిందితులను కస్టోడియన్ కేర్లో ఉంచాలి' - చిత్తూరు తాజా సమాచారం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులను.. మానసిక వైద్య పరీక్షల అనంతరం మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. వీరిద్దరికీ మానసిక సమస్యలున్నాయని తిరుపతి రుయా సైకియాట్రీ విభాగం వైద్యులు తెలిపారు. నిందితులను కస్టోడియన్ కేర్లో ఉంచాలని సూచించారు.

'మదనపల్లె నిందితులను కస్టోడియన్ కేర్లో ఉంచాలి'
చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో పద్మజ, పురుషోత్తంను మానసిక వైద్య పరీక్షల నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. వీరిని పరీక్షించిన సైకియాట్రీ విభాగం వైద్యులు.. ఇద్దరికీ మానసిక సమస్యలున్నాయని తెలిపారు. నిందితులను కస్టోడియన్ కేర్లో ఉంచాలని పేర్కొన్నారు. అటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలో విశాఖలో ఉందని.. వారిని అక్కడికు తీసుకెళ్లాలని సిఫారసు చేసినట్లు వైద్యులు చెప్పారు.