ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజీనామాలపై ఎలాంటి లేఖలు అందలేదు: 'మా' అధ్యక్షుడు విష్ణు - MAA ASSOCIATION ELECTIONS

తిరుమల శ్రీవారిని సినీనటుడు మోహన్‌బాబు, మంచు విష్ణు దర్శించుకున్నారు. ప్యానల్‌ సభ్యులతో కలిసి 'మా' అధ్యక్షుడు విష్ణు.. వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 'మా' ఎన్నికల్లో విజయంతో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నామని మంచు విష్ణు తెలిపారు.

MAA ASSOCIATION
MAA ASSOCIATION

By

Published : Oct 18, 2021, 9:00 AM IST

Updated : Oct 18, 2021, 10:51 AM IST

రాజీనామాలపై ఎలాంటి లేఖలు అందలేదు: 'మా' అధ్యక్షుడు విష్ణు

తిరుమల శ్రీవారిని సినీ నటులు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, బాబూ మోహన్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో విష్ణు ప్యానల్​తో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మా ఎన్నికల్లో గెలుపొందడంతో స్వామివారికి మొక్కులు చెలించుకున్నామన్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి మాకు తెలియదని.. రాజీ నామా విషయం మీడియా ద్వారా తెలిసిందని విష్ణు అన్నారు. రాజీనామాలపై ఎలాంటి లేఖలు అందలేదని.. లేఖలు అందితే స్పందిస్తామన్నారు.

తిరుమల శ్రీవారిని ఏపీ బీసీ కమీషన్ ఛైర్మన్ జస్టీస్ శంకర్ నారాయణ, మాజీ మంత్రి పనబాక లక్ష్మీ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ఇదీ చదవండి: jyothika birthday: వాలు కళ్ల వయ్యారి.. తేనే కళ్ల సింగారి

Last Updated : Oct 18, 2021, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details