రాష్ట్రంలో రెండున్నర ఏళ్లుగా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ మండిపడ్డారు. అనంతపురంలో విద్యార్థులపై దాడి, అమరావతి రైతులపై లాఠీఛార్జ్ చేయడం బాధాకరమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు లేకుండా వైకాపా నేతలు బయటకు రాగలరా అని ప్రశ్నించారు. రానున్న ప్రజా ఉద్యమంలో సీఎం జగన్ కొట్టుకుపోతారని పేర్కొన్నారు. 2024లో తెలుగుదేశం విజయం తధ్యమన్న లోకేశ్... దొంగ సంతకాలతో కుప్పం 14వ వార్డు ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపించారు.
పోలీసులు లేకుండా వైకాపా నాయకులు బయటకు రాగలరా?: లోకేశ్ - కుప్పం తాజా వార్తలు
అనంతపురంలో విద్యార్థుల దాడి, అమరావతి రైతులపై లాఠీఛార్జ్ చేయడం బాధాకరమని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
lokesh in kuppam