తిరుమల శ్రీవారిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్‌కు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ.సుబ్బారెడ్డి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా... తితిదే ఛైర్మన్.. స్పీకర్‌ను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. వారి వెంట రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయానికి స్పీకర్..