ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా వ్యాప్తి దృష్ట్యా తిరుపతిలో ఆగస్టు 5 వరకు లాక్​డౌన్​

చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఆగస్టు 5 వరకు లాక్​డౌన్​ విధిస్తూ కలెక్టర్​ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు పాటించి అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులకు సహకరించాలని కోరారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా తిరుపతిలో ఆగస్టు 5 వరకు లాక్​డౌన్​
కరోనా వ్యాప్తి దృష్ట్యా తిరుపతిలో ఆగస్టు 5 వరకు లాక్​డౌన్​

By

Published : Jul 20, 2020, 5:40 PM IST

కరోనా విజృంభణ దృష్ట్యా ఆగస్టు 5 వరకు తిరుపతిలో లాక్​డౌన్​ విధిస్తున్నట్లు కలెక్టర్​ నారాయణ భరత్​గుప్తా ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే నిత్యావసరాలకు అనుమతి ఇస్తామని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని మొత్తం కేసుల్లో 30 శాతం తిరుపతిలోనే నమోదయ్యాయని.. కరోనా వ్యాప్తి నివారణకు లాక్​డౌన్​ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్​ తెలిపారు.

ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు పాటించి.. పోలీసులు, వైద్య సిబ్బందికి సహకరించాలని కలెక్టర్​ సూచించారు. అనుమతిచ్చిన సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. జిల్లాలో ప్రధాన నగరమైన తిరుపతిలోనే రోజుకు రెండు వందలకు పైగా కొవిడ్​ పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details