ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రచారానికి వైకాపా ఎంపీ అభ్యర్థి.. అడ్డుకున్న స్థానికులు

దొరవారిసత్రం మండలం మావిళ్లపాడులో తిరుపతి వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే సంజీవయ్యకు చేదు అనుభవం ఎదురైంది. కరోనా విస్తరిస్తున్న తరుణంలో వైకాపా నాయకులు జనం వెంటేసుకుని ప్రచారం చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.

tirupati by poll
తిరుపతి ఉప ఎన్నిలో వైకాపా నేతలకు చేదు అనుభవం

By

Published : Apr 11, 2021, 4:58 PM IST

ప్రచారానికి వైకాపా ఎంపీ అభ్యర్థి.. అడ్డుకున్న స్థానికులు

నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం మావిళ్లపాడులో ప్రచారానికి వచ్చిన వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే సంజీవయ్యకు చేదు అనుభవం ఎదురైంది. వారి ప్రచారాన్ని స్థానికులు అడ్డుకున్నారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో వైకాపా నాయకులు జనం వెంటేసుకుని ప్రచారం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు గ్రామానికి కొన్ని కిలోమీటర్లు దూరంలోని సూళ్లూరుపేటలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు కా‌ర్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ గ్రామానికి కూడా చంద్రబాబు వచ్చే అవకాశం ఉన్న సమయంలో వైకాపా నాయకులు ప్రచారానికి రావడంపై వ్యతిరేకత వ్యక్తమైంది.

ABOUT THE AUTHOR

...view details