ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో కొలిక్కి రాని సర్పంచ్ అభ్యర్థుల జాబితా

తిరుపతి గ్రామీణ మండలంలోని 34 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులు ఖరారయ్యారు. కొన్నిచోట్ల ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు రెండు వర్గాలుగా ఏర్పడి సర్పంచ్ పదవి కోసం పోటీపడుతున్నారు. దీంతో మండల నాయకులకు తలనొప్పిగా మారింది. ముందునుంచి వెన్నంటి ఉన్న వారికి మొగ్గు చూపి.. మిగిలిన వారికి సీనియర్ నాయకులు సర్ది చెబుతున్నారు.

By

Published : Jan 31, 2021, 5:12 PM IST

List of unprepared sarpanch candidates in Tirupati chittoor district
తిరుపతిలో కొలిక్కి రాని సర్పంచ్ అభ్యర్థుల జాబితా...

సర్పంచి ఎన్నికలు రానే వచ్చాయి. తిరుపతి గ్రామీణ మండలంలో నాలుగో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అధికార పార్టీలో ఆశావహులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.. ద్వితీయ శ్రేణి నాయకులకు సర్దిచెప్పడం మండల నాయకులకు తలనొప్పిగా మారుతోంది.. అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపాలో అభ్యర్థుల జాబితా దాదాపుగా కొలిక్కిరాగా భాజపా, జనసేన వెదుకులాటలో ఉన్నాయి. తిరుపతి గ్రామీణ మండలంలో 34 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 400 వార్డులు ఉన్నాయి. మొత్తం 1,33,015 మంది ఓటర్లు ఉన్నారు.

అధికార పార్టీలో పెరుగుతున్న ఆశావహులు..

మండలంలోని అధికార పార్టీలో ప్రతి పంచాయతీలో రెండు వర్గాలు ఉన్నాయి. వీరు సర్పంచి పదవి తమకు కావాలని ఒక వర్గం, తమకే ఇవ్వాలనే మరో వర్గం పోటీ పడుతున్నాయి. ముందునుంచి వెన్నంటి ఉన్న వారికి ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యలో పార్టీలోకి వచ్చిన వారికి సర్ది చెబుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉండడంతో కొందరు పట్టువిడవకపోగా, మరికొందరు చేసేది ఏమీలేక మిన్నకుండి పోతున్నారు.

తెదేపాలో కొలిక్కి వస్తున్న జాబితా..

అభ్యర్థులు ఖరారైన పంచాయతీల్లో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేయడం గమనార్హం. తెదేపా మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను దాదాపుగా గుర్తించారు. మరో మూడు, నాలుగు పంచాయతీల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావాల్సి ఉంది. భాజపా, జనసేన పార్టీల మద్దతుతో గ్రామీణ మండలంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఇంకా కొలిక్కి రాలేదు.

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించడంతో అధికార పార్టీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో ఎమ్మెల్యే సూచనల మేరకు నాయకులు వీటిపై దృష్టి సారిస్తున్నట్టు విశ్వసనీయ సమచారం.

ఇదీ చదవండి:

'రామతీర్థం ఆలయాన్ని తితిదే పరిధిలోకి తీసుకురావాలి'

ABOUT THE AUTHOR

...view details