తిరుమలలోని గోగర్భం అటవీశాఖ గార్డెన్ కాపలదారుడి ఇంటికి సమీపంలో శనివారం రాత్రి చిరుత సంచరించింది. ఈ దృశ్యాలను కాపలాదారుడి కుమారుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఇటీవల ఘాట్‌రోడ్లలో తరచూ చిరుతలు కనిపిస్తున్నాయి. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో భక్తుల రాకపోకలు తగ్గడంతో వన్య ప్రాణుల సంచారం అధికమైంది.
TIRUMALA: తిరుమలలో మళ్లీ చిరుత సంచారం - చిరుతపులి
తిరుమలలో మళ్లీ చిరుత కనిపించింది. గోగర్భం అటవీశాఖ గార్డెన్ కాపలదారుడి ఇంటికి సమీపంలో రాత్రి నడుస్తూ వెళ్తుండగా..అధికారి కుమారుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.
తిరుమలలో మళ్లీ చిరుత సంచారం