తిరుమలలో రోడ్డు పక్కనే చిరుత.. వీడియో తీసిన స్థానికులు - తిరుమల దారిలో చిరుత వార్తలు
తిరుమల కనుమదారిలో చిరుతపులి సంచారాన్ని స్థానికులు గుర్తించారు. రెండో కనుమదారిలో హరణికి సమీపంలో రోడ్డు దాటుతుండగా గమనించారు. రోడ్డు పక్కన కాలువలో నక్కి ఉన్న చిరుతపులి దృశ్యాలను కారులో ప్రయాణిస్తూ చిత్రీకరించారు. కాలువలో నుంచి చిరుత అటవీ ప్రాంతంలోని పరుగులు పెట్టింది. చిరుత సంచారంతో కనుమ దారిలో ప్రయాణించే భక్తులను భద్రతా సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు.
తిరుమలలో రోడ్డు పక్కనే చిరుత.. వీడియో తీసిన స్థానికులు