తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలోప్రజాస్వామ్యాన్ని వైకాపా నేతలు ఖూనీ చేస్తున్నారని వామపక్షాల నేతలు ఆరోపించారు. సీపీఐ, సీపీఎం, రిపబ్లిక్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని విమర్శించారు. పరిసర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ప్రజలను బస్సుల్లో తీసుకువచ్చి.. బోగస్ గుర్తింపు కార్డులతో ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: వామపక్షాలు - నకిలీ ఓట్లు వేయడంపై తిరుపతిలో వామపక్షాల నిరసన
సీపీఎం, సీపీఐ, రిపబ్లికన్ పార్టీల ఆధ్వర్యంలో.. తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీ చేస్తోందంటూ పలువురు నేతలు నిరసనకు దిగారు. దొంగ ఐడీ కార్డులు సృష్టించి మరీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారన్నారు.
తిరుపతిలో వామపక్షాల నిరసన, తిరుపతి ఉప ఎన్నికలపై వామపక్షాల ఆందోళన