తిరుపతిలో వామపక్షాలు ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు రోడ్డుషోలో పాల్గొన్నారు. ప్రైవేటీకరణ దేశానికి శరాఘాతంగా మారనుందని సీపీఎం నేత మధు అన్నారు. 'ఒకే దేశం - ఒకే ఓటు' లక్ష్యంగా.. ప్రాంతీయ పార్టీల వినాశనం కోసం భాజపా కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కమలం పార్టీకి లేదన్నారు. సీపీఐ మద్దతుతో తిరుపతి ఉపఎన్నికలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుపతిలో వామపక్షాల ఉమ్మడి ఎన్నికల ప్రచారం
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వామపక్షాలైన సీపీఐ, సీపీఎంలు ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాయి. పార్టీల ముఖ్యనేతలు రామకృష్ణ, మధు రోడ్డుషోలో పాల్గొన్నారు.
మోసం చేయడం భాజపాకు వెన్నతో పెట్టిన విద్య అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఆ పార్టీని నమ్మి జనసేన మోసపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను అవమానించిన భాజపా.. ఇక్కడ సీఎం అభ్యర్థిగా ప్రకటించి అవకాశవాద రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలు తుడిచి పెట్టుకుపోవాలని జగన్ చూస్తున్నారని రామకృష్ణ అన్నారు. భాజపాకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం అభ్యర్థి విజయం కోసం సీపీఐ కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: ఉపఎన్నిక: తెదేపా ముమ్మర ప్రచారం..రంగంలోకి చంద్రబాబు