ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీషెల్స్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 4 ఎకరాల భూమి: తితిదే ఈవో - తిరులమ లేటెస్ట్ అప్​డేట్స్

సీషెల్స్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి విరాళంగా 4 ఎకరాల భూమి వచ్చిందని తితిదే ఈవో తెలిపారు. అక్కడ తితిదే ఆలయం నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలు, నిబంధనలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

land donated
సీషెల్స్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి విరాళం

By

Published : Apr 11, 2022, 9:52 AM IST

హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపసమూహ దేశమైన సీషెల్స్​లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆ దేశానికి చెందిన రామర్‌ పిళ్లై రూ.20 కోట్ల విలువైన 4 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అక్కడ తితిదే ఆలయం నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలు, నిబంధనలను పరిశీలిస్తామన్నారు. ఆదివారం తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడు ఎస్‌.శంకర్‌ అధ్యక్షతన బీఎన్‌సీ వరల్డ్‌ తొలి సమావేశం.. తిరుపతి ఛాప్టర్‌ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మారెడ్డి హాజరయ్యారు. తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడు ఎస్‌.శంకర్‌ రూ.60 లక్షల విలువైన 10 బ్యాటరీ వాహనాలను తితిదేకి విరాళంగా అందించారు. వాహనాల పత్రాలను, తాళాలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, బీఎన్‌సీ వరల్డ్‌ సభ్యులు మాధవన్‌, యోగేషాలకాని పాల్గొన్నారు.

ఇదీ చదవండి: She Autostand: తిరుపతిలో మహిళా డ్రైవర్ల కోసం ప్రత్యేక ఆటోస్టాండ్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details