'మీ కాళ్లు మొక్కుతా.. నాకు ఇల్లు మంజూరు చేయండి.. భర్త మృతిచెందాడు.. ఉండటానికి గూడు లేదు.. చిన్న పాకలో ఉంటున్నా.. వర్షాల సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నా' అని తిరుపతి జిల్లా సీఎల్‌ఎన్‌పల్లి పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన చెంగమ్మ..ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుట కన్నీరుమున్నీరైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం వచ్చిన ఎమ్మెల్యేకు ఈ మేరకు విన్నవించింది. తూర్పు హరిజనవాడకు చెందిన బజ్జమ్మ అనే మరో మహిళ కూడా తన ఆవేదనను వెలిబుచ్చింది. ‘నా భర్త గతంలో చనిపోయాడు. ఆ తర్వాత మూడు నెలలకే కుమారుడు మృతిచెందాడు. ఇప్పటికీ వైఎస్‌ఆర్ బీమా మంజూరు కాలేదు. రెండేళ్లుగా తిరుగుతున్నా ఫలితం లేకపోయింది’ అని బజ్జమ్మ వాపోయింది.
Gadapa gadapaku program: 'కాలు మొక్కుతా.. ఇల్లు ఇప్పించండి..' - తిరుపతి జిల్లాలో గడప గడపకు కార్యక్రమం
Gadapa gadapaku program: భర్త మరణించిన తనకు ఇల్లు మంజూరు చేసి సాయం చేయాలని ఓ మహిళ ఎమ్మెల్యే కాళ్ల మీద పడింది. మరో మహిళ సైతం తన గోడును ఎమ్మెల్యే ముందు వెళ్లబోసుకుంది. తిరుపతి జిల్లాలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సరేశ్కు స్థానికులు సమస్యలతో స్వాగతం పలికారు. ఎక్కడంటే..?
ఇల్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి