ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Woman in Trouble: పని కోసం మస్కట్​కు పంపిస్తానని.. రూ.20 లక్షలకు అమ్మేసింది..! - Agent Cheated Woman

Torture in muscat : ఆమె బతుకుదెరువు కోసం మస్కట్​ వెళ్లింది.. అక్కడ యాజమాని చిత్రహింసలకు గురి చేశాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొంది.. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. తనను ఏజెంట్​ మోసం చేసిందని తెలపడంతో విషయం వెలుగుచూసింది. బాదితురాలిని రూ.20 లక్షలకు కొన్నట్లు యజమాని తెలుపుతుండగా.. ఏజెంట్​ రత్నమ్మ రూ. రెండు లక్షలు ఇస్తే ఇంటికి రప్పిస్తానని తెలుపుతోంది.

Woman cheated by agent
మస్కట్

By

Published : Sep 14, 2022, 4:22 PM IST

Agent Cheated Woman: మస్కట్‌కు పంపిస్తానని చెప్పి.. అక్కడి యజమానికి రూ. 20 లక్షలకు ఓ ఏజెంట్​ మహిళను అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలోని బోడేవాండ్లపల్లి పంచాయతీ చెట్టి ఎస్సీ కాలనీకి చెందిన సులోచన.. అదే మండలానికి చెందిన ఏజెంట్‌ రత్నమ్మ చేతిలో మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సీ కాలనీకి చెందిన బాలసుబ్రహ్మణ్యం తన భార్య సులోచనను స్థానిక ఏజెంట్‌ రత్నమ్మ ద్వారా మస్కట్‌కు పంపించారు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి ఆమెను యాజమాని చిత్రహింసలకు గురి చేశాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొంది, ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఏజెంటు రత్నమ్మను నిలదీయగా.. తనకేమీ తెలియదని.. 2లక్షల రూపాయలు చెల్లిస్తే కానీ సులోచనను తిరిగి తీసుకురాలేమని చెప్పింది. అనంతరం కుటుంబ సభ్యులు మస్కట్‌లో ఉంటున్న యజమానిని అడగ్గా.. సులోచనను.. రత్నమ్మ 20లక్షల రూపాయలకు తనకు అమ్మేసిందని.. పంపడం కుదరదని తెలిపాడు. దీంతో బాలసుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం స్పందించి సులోచనను స్వగ్రామానికి తీసుకురావాలని ఆయన కోరారు.

ఏజెంట్​ మోసం చేసిందని బాధితురాలి ఆవేదన

''ఏడు నెలల క్రితం ఎజెంట్ రత్నమ్మ ద్వారా నా భార్య మస్కట్ వెళ్లింది. మెుదటి నాలుగు నెలలపాటు బాగానే ఉన్నా.. తరువాత రెండు నెలల నుంచి అక్కడ ఇబ్బందులకు గురవుతోంది. నా భార్య కాలుకు గాయాలు అయినట్లు ఫోన్ ద్వారా తెలిపింది. తనను తిరిగి ఇంటికి రప్పించాలని ఏజెంట్ రత్నమ్మను నా భార్య ఫోన్ ద్వారా అడిగితే.. రూ.2 లక్షలు డిమాండ్ చేసింది. ఇదే విషయమై ఏర్రవారిపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాను.. నా భార్యను రప్పించడానికి పోలీసులతో పాటు.. ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను'' - బాలసుబ్రహ్మణ్యం, బాధితురాలి భర్త

ABOUT THE AUTHOR

...view details