ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో వైభవంగా కోయిల్​ ఆళ్వార్​ తిరుమంజనం - Koyal Alwar Thirumanjana service in Tirumala

తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా జరిగింది. రానున్న తెలుగు సంవత్సరాది సందర్భంగా ఆలయం శుద్ధి చేశారు. కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలో సిబ్బందిని అనుమతించి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Koyal Alwar Thirumanjana service in Tirumala
తిరుమలలో వైభవంగా కోయిల్​ ఆళ్వార్​ తిరుమంజనం సేవ

By

Published : Mar 24, 2020, 10:42 AM IST

Updated : Mar 24, 2020, 3:54 PM IST

తిరుమలలో వైభవంగా కోయిల్​ ఆళ్వార్​ తిరుమంజనం సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. రానున్న తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున స్వామివారికి సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్టును పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో ప్రదక్షణంగా వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

ఆనందనిలయం, బంగారువాకిలి శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరిచారు. అనంతరం స్వామివారికి కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు. కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలో సిబ్బందిని అనుమతించి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Last Updated : Mar 24, 2020, 3:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details