ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Koil alwar tirumanjanam: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. తెలుగు సంవత్సారాది.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.

Koil alwar tirumanjanam at ttd
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

By

Published : Mar 29, 2022, 11:00 AM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Koil alwar tirumanjanam: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. తెలుగు సంవత్సారాది.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్టును పట్టు వస్త్రంతో అర్చకలు పూర్తిగా కప్పివేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో ధ్వజస్తంభం వద్దకు ప్రదక్షిణంగా వెళ్లి.. ఆలయ శుద్ధికార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఆనందనిలయం, బంగారువాకిలితోపాటు ఆలయంలోని ఉపదేవాలయాలు, పూజాసామాగ్రి తదితర అన్ని చోట్ల శుభ్రపరిచారు. స్వామివారికి ప్రత్యేక పూజలు.. నైవేద్యం సమర్పించిన అనంతరం మధ్యాహ్నం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details