ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని మతోన్మాద శక్తులు ధ్వంసం చేస్తున్నాయి: కేరళ మంత్రి రాజన్ - కేరళ మంత్రి రాజన్ న్యూస్

దేశంలో రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని మతోన్మాద శక్తులు ధ్వంసం చేస్తున్నాయని కేరళ రెవిన్యూ శాఖ మంత్రి రాజన్ అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన..వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక వాదులు భాజపా కుట్రలను దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని మతోన్మాద శక్తులు ధ్వంసం చేస్తున్నాయి
రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని మతోన్మాద శక్తులు ధ్వంసం చేస్తున్నాయి

By

Published : Nov 13, 2021, 10:39 PM IST

రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని మతోన్మాద శక్తులు ధ్వంసం చేస్తున్నాయి

దేశంలో రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని మతోన్మాద శక్తులు ధ్వంసం చేస్తున్నాయని కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ అన్నారు. తిరుపతిలో ఆదివారం జరగనున్న దక్షిణ భారత కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక వాదులు భాజపా కుట్రలను దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

కేరళలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు పెద్దపీట వేశామని అన్నారు. వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోయినా..తమ ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించిందన్నారు. కేరళలో 1660 గ్రామాలను స్మార్ట్ విలేజ్ లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం, వ్యవసాయ భూముల పంపిణీ చేపట్టామని వెల్లడించారు. స్థానిక పరిస్థితులను అనుసరించి 4 నుంచి 10 సెంట్ల వరకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాజన్ స్పష్టం చేశారు.

"దేశంలో రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని మతోన్మాద శక్తులు ధ్వంసం చేస్తున్నాయి. వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక వాదులు భాజపా కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. కేరళలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు పెద్దపీట వేశాం.కేంద్రం సహకరించకపోయినా తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది."- రాజన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి

ఇదీ చదవండి

Southern Zonal Council Meet: తిరుపతి చేరుకున్న హోంమంత్రి అమిత్ షా

ABOUT THE AUTHOR

...view details