ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐకమత్యంతోనే లంబాడీలకు రాజ్యాధికారం: కేరళ ఐజీ - బంజారాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేరళ ఐజీ న్యూస్

ఐకమత్యంతోనే లంబాడీలకు రాజ్యాధికారం లభిస్తుందని కేరళ ఐజీ లక్ష్మణ్ నాయక్ పేర్కొన్నారు. కడప జిల్లాలోని రాయచోటి ఎన్జీవో హోమ్​లో ఏర్పాటు చేసిన బంజారాల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు.

Kerala IG visited Kadapa and Chittoor districts
కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించిన కేరళ ఐజీ

By

Published : Jan 24, 2021, 11:19 AM IST

కడప, చిత్తూరు జిల్లాల పర్యటనలో భాగంగా.. రాయచోటి ఎన్జీవో హోమ్ లో ఏర్పాటు చేసిన బంజారాల ఆత్మీయ సమ్మేళనంలో కేరళ ఐజీ లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు. ఐకమత్యంతోనే లంబాడీలకు రాజ్యాధికారం లభిస్తుందని అన్నారు. అందరూ.. కలిసికట్టుగా ఉండి అభివృద్ధి పదంలో నడవాలని కోరారు. చిత్తూరు జిల్లా జిల్లెల్లమంద తాండా నుంచి మాచిరెడ్డిగారిపల్లి గ్రామ పంచాయతీ మీదుగా పర్యటిస్తూ.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. అనంతరం సుండుపల్లి చేరుకున్న ఆయనకు స్థానికులు, లంబాడీలు ఘన స్వాగతం పలికారు. బంజారా ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

రానున్న తరాలకు మనం లంబాడీలమని తెలియజేసేలా.. మన భాష, యాసను తప్పక నేర్పించాలని అన్నారు. 18 రాష్ట్రాల్లో సుమారు 12 కోట్ల మంది లంబాడీ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారని గుర్తు చేశారు. బంజారా సంఘాలు, కమిటీల ఏర్పాటుతో మన సమస్యలను మనమే పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక్కటిగా ముందుకు వెళితే.. ఐక్యతను చాటుకున్న వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు డాక్టర్ క్రిష్ణానాయక్, డాక్టర్ సునీల్ కుమార్ నాయక్, పనాయక్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details