తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం గురువారం సాయంత్రం జరగనుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తైన తరువాత దీపోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు... నేతి వత్తులతో దీపాలు వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలోని శ్రీవారికి హారతి ఇస్తారు. అనంతరం గర్భాలయం, ఉప ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను తితిదే రద్దు చేసింది.కార్తిక పౌర్ణమి సందర్భంగా రాత్రి గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. గరుడవాహనంపై ఊరేగుతూ శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు.
TIRUMALA : తిరుమలలో నేడు కార్తిక దీపోత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు కార్తిక దీపోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం, ఉప ఆలయాల్లో నేతి ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా రాత్రి గరుడ వాహనసేవ నిర్వహిస్తారు.
తిరుమలలో నేడు కార్తిక దీపోత్సవం