తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్చించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి హోం మంత్రి నమశ్సివాయం, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే ఆధికారులు... దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి హాజరైన వీరు... ఇవాళ స్వామివారి ఆశీస్సులు పొందారు.
tirumala: శ్రీవారిలో సేవలో కర్ణాటక సీఎం, పలువురు ప్రముఖులు - తిరుమల తాజా వార్తలు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి హోంమంత్రి, తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారిలో సేవలో కర్ణాటక సీఎం
Last Updated : Nov 15, 2021, 9:43 AM IST